శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 10 జులై 2021 (14:40 IST)

సీఎం కేసీఆర్‌పై మాటల తూటాలు పేల్చిన ఈటల.... ఎం జరిగిందో వెల్లడిస్తా...

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ మాజీ నేత, బీజేపీ నేత ఈటల రాజేందర్ మరోమారు మాటల తూటాలు పేల్చారు. ఎన్నికలు వచ్చినపుడు ఏం జరిగిందో బయటపెడతానంటూ హెచ్చరికలు చేశారు. 
 
త్వరలోనే తాను రాజీనామా చేసిన హుజురాబాద్ స్థానానికి ఉప ఎన్నికలు జరుగనున్నయి. ఈ పరిస్థితుల్లో ఈటల రాజేందర్ మరోసారి సీఎం కేసీఆర్‌పై మాటల తూటాలను పేల్చారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటనలో ఆయన.. కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 
కంచె చేను మేసిన చందంగా టీఆర్ఎస్ తీరు ఉందని విమర్శించారు. తనకు వ్యతిరేకంగా.. తనను ఓడించడానికి కాంగ్రెస్ నాయకుడికి డబ్బులు ఇచ్చిన దుర్మార్గపు చరిత్ర వాళ్లది అని పేర్కొన్నారు. 
 
'పెన్షన్లు.. రేషన్లు.. ఇవ్వలేని మంత్రిపదవి ఎందుకని అడిగానని.. తప్పా అది ఏమైనా? గుట్టలు.. కంచెలు.. భూస్వాములు.. వ్యాపారులకు రైతుబంధు ఇవ్వొద్దని చెప్పా. డబ్బులు ఎక్కువ ఉంటే… దళితులకు, బడుగులకు, నిరుద్యోగులకు లక్ష రూపాయల చొప్పున ఇస్తే బాగుంటుందని సూచించా' అని ఈటల వ్యాఖ్యానించారు.