రూ.8వేలకు చిన్నారిని విక్రయించిన మహిళా కిడ్నాపర్ అరెస్ట్
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఓ లేడీ కిడ్నాపర్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.. చంచల్ గూడ జైలు వద్ద యాచకురాలి ఆరేళ్ల కూతురిని కిడ్నాప్ చేసిన ఆగంతకురాలు.. కాంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాబానగర్‌లో ఓ వ్యక్తికి 8 వేల రూపాయలకు ఆ చిన్నారిని విక్రయించింది.
ఇక, కూతురు కిడ్నాప్ విషయంపై బాధితురాలి పోలీసులను ఆశ్రయించింది.. కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల.. లేడీ కిడ్నాపర్‌ను అరెస్ట్ చేశారు.. ఆమె దగ్గర రూ.8 వేలు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.