ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (08:47 IST)

మళ్లీ తగ్గిన బంగారం ధరలు... ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..

దేశంలోని పసిడి ప్రియులకు ఇది నిజంగానే శుభవార్త. దేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ అనంతరం తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో రెండు రోజుల నుంచి ధరలు స్వల్పంగా దిగివస్తున్నాయి. 
 
తాజాగా మంగళవారం ధర స్వల్పంగా తగ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.46,010గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,010 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో మంగళవారం ఉదయం ఆరుగంటల వరకు నమోదైన ధరల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. కాగా.. దేశీయంగా 10 గ్రాముల బంగారంపై రూ.60 మేర తగ్గింది.
 
ఇక ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే... ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,140 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,340గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,010గా ఉంది.
 
హైదరాబాద్‌ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990 ఉంది.