1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , సోమవారం, 13 సెప్టెంబరు 2021 (18:12 IST)

హీరో సాయితేజ్ యాక్సిడెంట్ తో గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిపాలిటీలో క‌ద‌లిక‌!

హైదరాబాద్ లో రోడ్డు ప్ర‌మాదంలో సినీ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ గాయ‌ప‌డిన సంఘ‌ట‌న‌తో అధికారులు మేల్కొన్నారు. బైక్ పై వెళ్ళుతూ, రోడ్డుపై మట్టి వల్ల సినీ హీరో సాయితేజ్ బండి స్కిడ్ అయి ప్రమాదం బారిన పడడంతో జీహెచ్ఎంసీ మేల్కొంది. ప్రత్యేక చర్యలు చేపడుతూ, రోడ్లన్నింటినీ శుభ్రం చేయిస్తోంది.

ముఖ్యంగా భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేస్తున్న వారిపై జీహెచ్ఎంసీ కొరడా ఝులిపిస్తోంది. మాదాపూర్ ఖానామెట్ పరిధిలో భవన నిర్మాణం చేపడుతున్న అరబిందో కన్‌స్ట్రక్షన్‌కు జీహెచ్‌ఎంసీ చందానగర్ సర్కిల్ అధికారులు లక్ష రూపాయల జరిమానా విధించారు. అలాగే, హైద‌రాబాదు రోడ్ల‌పై మ‌ట్టి పేరుకుపోకుండా జాగ్ర‌త్త‌లు ప్రారంభించారు. నిత్యం పారిశుధ్య సిబ్బంది రోడ్ల‌పై మ‌ట్టి ఉండ‌కుండా చూడాల‌ని ఆదేశాలు జారీ చేశారు.
 
సినీ హీరో బండి వేగంగా న‌డ‌ప‌డం వ‌ల్ల ప్ర‌మాదం బారిన ప‌డినా, అందుకు న‌డి రోడ్డుపై బండి స్కిడ్ అవ‌టం కూడా ఒక కార‌ణ‌మే. అందుకే గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిపాలిటీ వారు త‌క్ష‌ణం ఇలా స్పందిస్తున్నారు.