గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 సెప్టెంబరు 2021 (14:18 IST)

మియాపూర్‌లో చిన్నారి అనుమానాస్పద మృతి

హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌‌లో విషాదం చోటుచేసుకుంది. 13 నెలల చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మియపూర్ ఓంకార్ నగర్‌లో ఆదివారం సాయంత్రం నుండి కనిపించకుండా పోయింది. 
 
ఈ చిన్నారి సోమవారం తెల్లవారుజామున ఇంటి ముందు శవమై కనిపించింది. తొలుత చిన్నారి మృతదేహాన్ని ఆమె అమ్మమ్మ చూసింది. ఇక నీటిలో ముంచి చిన్నారిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
13 ఏళ్ల బాలుడు ఎత్తికెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాప కళ్లు పొడిచి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. పాప కళ్ళు పొడిచి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.