డిగ్రీ లేదని పెళ్లి రద్దు - నిశ్చితార్థంలో వరుడుకు షాకిచ్చిన వధువు  
                                       
                  
				  				   
				   
                  				  తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా వైరాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. తనకు కాబోయే కనీసం డిగ్రీ అయినా చేసివుండాలని పట్టుబట్టిన ఓ యువతి... నిశ్చితార్థం రోజున వరుడిని ఛీకొట్టింది. కాబోయే భర్త డిగ్రీ మధ్యలోనే ఆపేయడంతో ఓ యువతి అతడితో పెళ్లికి నిరాకరించింది. 
				  											
																													
									  
	 
	తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వైరా మండలం మల్లాపురం గ్రామానికి చెందిన బీటెక్ చదివిన అమ్మాయికి ఈర్లపూడిలోని భాగ్య తండాకు చెందిన ఇక్బాల్ అనే వ్యక్తితో పెళ్లి కుదిరింది. 
				  
	 
	ఈ నేపథ్యంలో ఆదివారం యువతి ఇంటివద్ద నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. అయితే పెళ్లి చూపుల సమయంలో యువకుడు తాను డిగ్రీ పూర్తి చేశానని యువతి కుటుంబ సభ్యులను నమ్మించాడు.
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	అయితే, అతను డిగ్రీ పాస్ కాలేదనీ, చదువును మధ్యలోనే ఆపేశాడనే విషయం నిశ్చితార్థం సమయంలో వధువుకు తెలిసింది. దీంతో ఆ యువతి వెంటనే తనను మోసం చేశాడంటూ నిశ్చితార్థం రద్దు చేసుకుంది. 
				  																		
											
									  
	 
	ఈ సందర్బంగా యువకుడికి యువతి కుటుంబ సభ్యులకు మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో యువతి తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.