గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 ఆగస్టు 2021 (10:00 IST)

మూటాపురంలో దారుణం : ఆరేళ్ళ చిన్నారిపై వృద్ధుడి అత్యాచారం

ఖమ్మం జిల్లా మూటాపురంలో దారుణం జరిగింది. ఆరేళ్ళ చిన్నారిపై 60 యేళ్ళ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అమానవీయ ఘటన జిల్లాలోని నేలకొండపల్లి మండలం మూటాపురం గ్రామ పరిధిలోని పెద్దతండాలో జరిగింది. 
 
ఈ దారుణంపై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. మూటాపురం పెద్దతండాకు చెందిన బాణోతు దీప్లా (60) అనే వృద్ధుడు... బుధవారం మధ్యాహ్నం తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఓ ఆరేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. 
 
బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెతుకుతుండగా.. దీప్లా ఇంట్లో నుంచి చిన్నారి ఏడుపు వినిపించింది. దీంతో లోపలికి వెళ్లి చూసిన వాళ్లకు కన్నీళ్లు ఆగలేదు. 
 
వెంటనే చిన్నారిని తీసుకొని నేలకొండపల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. తమ కూతురుపై దీప్లా అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి.. ఫోక్సో కేసు నమోదు చేశామని నేలకొండపల్లి ఎస్‌ఐ అశోక్‌ తెలిపారు.