శనివారం, 4 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 3 అక్టోబరు 2025 (19:51 IST)

Kajol Durga Puja 2025 viral video, నటి కాజోల్‌ను తాకరాని చోట తాకాడంటూ...

Kajol
బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ గత వారం రోజులుగా దుర్గా నవరాత్రుల సందర్భంగా పూజాది కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. తను పాల్గొన్న పూజా కార్యక్రమాలు సోషల్ మీడియాలో ప్రతిరోజూ షేర్ అవుతూ వున్నాయి. ఐతే అక్టోబరు 2 విజయదశమి నాడు కాజోల్ కు ఎందరో అభిమానులు ఆమెకి దసరా శుభాకాంక్షలు తెలిపారు. కానీ వారిలో ఒకరు మాత్రం నటి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
 
వీడియోలో ఏమున్నదంటే... కాజోల్ దుర్గా మాతను దర్శించుకుని మెట్ల పైనుంచి కిందికి దిగుతున్నారు. అదేసమయంలో ఆమెకి అడ్డుగా ఓ వ్యక్తి చేయి పెట్టాడు. ఆ సమయంలో అతడి చేయి ఆమెను తాకరాని చోట తాకినట్లు కొందరు కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి ఆ వ్యక్తి కాజోల్ వ్యక్తిగత భద్రతకు చెందిన వ్యక్తి అనీ, పలుసార్లు అతడిని చూసినట్లు చెబుతున్నారు.
 
కాజోల్ కాలు జారి పడుతుంటే అతడు పట్టుకున్నాడని అంటున్నారు. మరికొందరు... అసలు ఆ వీడియో నిజమైనదా లేదంటే ఏఐ వీడియోనా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఇలావుంటే ఈ ఘటనపై కాజోల్ ఇంతవరకూ స్పందించలేదు. కనుక దానిగురించి వదిలేయండి మరికొందరు కామెంట్ చేస్తున్నారు.