శనివారం, 4 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 3 అక్టోబరు 2025 (23:14 IST)

నా కుమార్తె న్యూడ్ ఫోటోలు అడిగారు: నటుడు అక్షయ్ కుమార్ ఆవేదన

Akshay kumar
సైబర్ నేరగాళ్ల ఆగడాలు, వాళ్లు చేసే నేరాలు ఎలా వుంటాయో బాలీవుడ్ నటుడు తన కుమార్తెకు ఎదురైన చేదు అనుభవాన్ని గురించి చెబుతూ వివరించారు. ఆయన మాట్లాడుతూ... నా కుమార్తె వీడియో గేమ్ ఆడుతున్న సమయంలో సైబర్ నేరగాళ్లు ఆమె న్యూడ్ ఫోటోలు పంపాలంటూ అడిగారు. అది చూసి నేను ఎంతగానో చలించిపోయాను అని అన్నారు.
 
చిన్నారుల పట్ల సైబర్ మోసగాళ్లు ఎలా వల పన్నుతారో వివరించి చెప్పారు. ముంబైలో జరిగిన సైబర్ నేరాల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 7 నుంచి 10 తరగతి విద్యార్థులకు ప్రతివారం ఒక సైబర్ నేరాల అవగాహనపై పీరియడ్ వుండాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను కోరారు.