మందుల విషయంలో గొడవ.. తల్లిని హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?
హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్‌లో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. మందుల విషయంలో జరిగిన గొడవ తర్వాత 42 ఏళ్ల మహిళ తన 90 ఏళ్ల తల్లిని ఇనుప రాడ్‌తో చంపింది. ఆ వృద్ధురాలు అక్కడికక్కడే మరణించింది. మాత్రలు వేసుకోకపోవడంపై జరిగిన వాగ్వాదంలో కూతురు తన తల్లిపై దాడి చేసిందని పోలీసులు తెలిపారు.
కూతురు మానసికంగా స్థిరంగా లేదని స్థానికులు అధికారులకు తెలిపారు. ఇంకా ఈ ఘటనలో కూతుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. నగరం నడిబొడ్డున జరిగిన ఈ దారుణ హత్య స్థానికులకు షాక్ ఇచ్చింది. ఈ సంఘటన ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.