శుక్రవారం, 3 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 సెప్టెంబరు 2025 (20:15 IST)

నా కుటుంబం నుంచి దూరం చేసిన వారి అంతు చూస్తా : కె.కవిత

Kavitha
తన కుటుంబం నుంచి తనను దూరం చేసినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారి అంతు చూస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివారం చింతమడకలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఒకింత ఎమోషనలక్‌కు గురయ్యారు. భారత రాష్ట్ర సమితి నుంచి ఆమెను బహిష్కరించిన విషయం తెల్సిందే. 
 
'ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితిలో ఇక్కడికి వచ్చాను. ఉద్యమం మొదలయ్యాక కేసీఆర్‌ ఇక్కడికి మరొకరిని తెచ్చిపెట్టారు. కొందరు సిద్దిపేట, చింతమడక తమ ప్రైవేట్‌ ప్రాపర్టీలా వ్యవహరిస్తున్నారు. చింతమడక చిరుత పులులనుకన్నది. రాజకీయంగా ఆంక్షలు పెడితే మళ్లీ ఇక్కడకు వస్తాం. కేసీఆర్‌కు మచ్చ తెచ్చే పనులు కొందరు చేశారు. ఇదే విషయం నేను చెబితే నన్ను బద్నాం చేశారు. నా కుటుంబం నుంచి నన్ను దూరం చేసిన వాళ్లను వదలను. ఈ గడ్డ ఎవరి జాగీరూ కాదు.. ఆంక్షలు పెడితే మళ్లీ మళ్లీ వస్తా' అని కవిత అన్నారు. 
 
"ఓజీ" బెన్ఫిట్ షో టిక్కెట్ ధర రూ.1.29 వేలు - సొంతం చేసుకున్న వీరాభిమాని 
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ఓజీ. ఈ నెల 25వ తేదీన విడుదలకానుంది. దీంతో ఈ సినిమాకు టిక్కెట్ల  అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని శ్రీనివాసా థియేటర్లో 'ఓజీ' బెనిఫిట్‌ షో టికెట్‌ వేలం పాటను ఆయన అభిమానులు నిర్వహించారు. 
 
దీనికి 'జబర్దస్త్‌' ఫేమ్‌ వినోదిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పవన్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో వేలం పాటలో పాల్గొన్నారు. లక్కారం గ్రామానికి చెందిన అభిమాని ఆముదాల పరమేశ్‌ ఏకంగా రూ.1,29,999కి టికెట్‌ను దక్కించుకున్నారు. వేలం పాట ద్వారా వచ్చిన డబ్బును జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నట్లు పార్టీ అభిమానులు పేర్కొన్నారు.