సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (16:31 IST)

వరద బాధితులకు అల్లు అర్జున్‌ చేయూత

ఏపీలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఏపీ ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. వరదల కారణంగా అనేకమంది నిరాశ్రయులయ్యారు. వరదబాధితులకు ఏపీ సర్కారు తగిన సాయం అందిస్తున్న తరుణంలో సినీ ప్రముఖులు కూడా ఏపీ ప్రజలకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
 
ఇప్పటికే ఎన్టీఆర్, మహేష్ బాబు, చిరంజీవిలు తలా రూ.25లక్షల చొప్పున వరద సాయం చేశారు. ఇదే కోవలో ఏపీ ప్రజలకు అండగా నిలిచారు అల్లు అర్జున్.
 
ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు ప్ర‌జ‌లు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని తెలుపుతూ.. తన వంతు సాయంగా ఏపీ రిలీఫ్ ఫండ్‌కి రూ.25 ల‌క్ష‌ల విరాళం అందిస్తున్నానని పేర్కొంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్.