1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 15 జులై 2025 (18:03 IST)

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

Sidda Reddy
తను వైసిపికి చెందిన నాయకుడిని అని తెలిసినా తన కుటుంబాన్ని ఆదుకున్న దేవుడు నందమూరి బాలకృష్ణ అంటున్నారు వైసిపి నాయకుడు సిద్దారెడ్డి. తనకు బాలయ్య చేసిన సాయం జన్మలో మరవలేమని చెపుతున్నారు.
 
సిద్దారెడ్డి మాట్లాడుతూ... నేను బ్లాక్ ఫంగస్ జబ్బుతో బాధపడుతున్నాను. ఆ సమయంలో నాకు సాయం అందలేదు. విషయం బాలయ్యకు తెలిసి నాకు అయిన వైద్య ఖర్చులన్నీ భరించి వైద్యం చేయించారు. ఆయనవల్లనే నేను బ్రతికి బయటపడ్డాను.
 
నా కుమార్తెలను పైచదువులకు వెళ్లేందుకు సాయం చేసారు. అమెరికా వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక సాయం చేసారు. నాకు వైద్యానికి అయిన రూ. 15 లక్షల వరకూ భరించారు. అందుకే దేవుడు ఫోటోల పక్కన బాలయ్య ఫోటో పెట్టుకున్నాము అని చెప్పారు సిద్దారెడ్డి.