శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (15:11 IST)

కుమారుడి కోసం మళ్లీ కలిసిన అమీర్ ఖాన్ దంపతులు

బాలీవుడ్ అగ్రహీరో అమీర్ ఖాన్ తన కుమారుడు కోసం మళ్లీ కలిశారు. ఇటీవల తన రెండో భార్య కిరణ్ రావుకు విడాకులు ఇచ్చిన విషయం తెల్సిందే. అయితే, విడాకులు తీసుకున్నప్పటికీ కుమారుడు కోసం అపుడపుడూ కలవాలని నిర్ణయించుకున్నారు. అలాగే, ఫ్రెండ్స్‌గా కలిసివుంటామని చెప్పారు. ఈ మాటలకు గుర్తుగా వారు పలు సందర్భాల్లో కలుసుకుంటున్నారు. 
 
కుమారుడు ఆజాద్ పుట్టిన రోజు కోసం వారిద్దరూ కలిశారు. ఈ సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు ఇపుడు వైరల్‌గా మారాయి. ఇదిలావుంటే, అమీర్ ఖాన్ తన తదుపరి చిత్రంలో అమీర్ ఖాన్ చిత్రం కోసం కిరణ్ రావు పనిచేస్తున్నారు. 
 
ఇకపోతే, అమీర్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం లాల్ సింగ్ చద్దా. ఈ సినిమా విషయానికి వస్తే ఈ నెలలో విడుదల కావాల్సి వున్నప్పటికీ టెక్నికల్ వర్క్స్ పూర్తికాకపోవడంతో దీన్ని వాయిదా వేశారు.