శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 నవంబరు 2021 (20:36 IST)

దంగల్ బ్యూటీ ఫాతిమాతో అమీర్ ఖాన్ పెళ్లి..?

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ పెళ్ళికొడుకు కానున్నాడట. ఇటీవలే అమిర్ తన రెండో భార్య కిరణ్ రావుకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విడాకులకు దంగల్ బ్యూటీ కారణమట. దంగల్  బ్యూటీ ఫాతిమా సనా షేక్ తో అమీర్ ఖాన్ పీకల్లోతు ప్రేమలో మునగడమే అని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే.

దీంతో వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకొనునట్లు బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దంగల్ చిత్రంలో అమీర్‌కి పెద్ద కూతురిగా నటించిన ఫాతిమా ఆ సినిమా షూటింగ్ లోనే అమీర్ తో ప్రేమలో పడినట్లు సమాచారం.
 
ప్రస్తుతం అమీర్ నటించిన లాల్ సింగ్ చద్దా .. విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమా తర్వాత ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది.  హిందీ సినిమా- టెలివిజన్ రంగాలకు సుపరిచితురాలు అయిన ఫాతిమా చాయ్ 420,వన్ 2 కా 4 వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సనా షేక్ కెరీర్ ప్రారంభించారు.
 
అమీర్ ఖాన్ సరసన `దంగల్` చిత్రంలోనూ నటించింది. అప్పటి నుంచి సనా షేక్ తో అమీర్ ఖాన్ ఎఫైర్ వార్తలు అంతర్జాలాన్ని షేక్ చేస్తూనే ఉన్నాయి. 29 ఏళ్ల ఫాతిమా.. 56 ఏళ్ల అమీర్‌తో వరుసగా రెండు సినిమాలు చేసింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందని బాలీవుడ్‌ మీడియా హౌజ్‌లలో పుకార్లు వినిపించాయి. ఈ విష‌యాన్ని ఫాతిమా ప‌లు సార్లు ఖండించింది. ఇలా అమీర్ ఖాన్ విడాకుల విష‌యాన్ని ఫాతిమాకు లింక్ పెట్డం భావ స్వేచ్ఛ ప్ర‌క‌ట‌న‌లో భాగం అని నెటిజ‌న్స్ అంటున్నారు.