ఆదివారం, 23 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 నవంబరు 2025 (17:08 IST)

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

flight
విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. అత్యవసర కారణాలతో ప్రయాణాన్ని కొన్ని గంటలకు ముందు టిక్కెట్ రద్దు చేసుకున్నా... ఇకపై టిక్కెట్ మొత్తంలో సింహ భాగం రీఫండ్ ఇవ్వనున్నారు. విమాన టికెట్‌లోనే అంతర్లీనంగా ట్రావెల్ ఇన్సూరెన్స్ సౌకర్యం ప్రవేశపెట్టడం ద్వారా చివరి నిమిషంలో టిక్కెట్ రద్దు చేసుకున్నా 80 శాత వరకు రీఫండ్ పొందేలా కొత్త విధానాన్ని తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. రానున్న రెండు, మూడు నెలల్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు పౌర విమానయాన శాఖ కసరత్తు చేస్తోంది. 
 
ప్రస్తుతం విమానం బయలుదేరడానికి మూడు గంటల ముందు టిక్కెట్ రద్దు చేస్తే దాన్ని నో షోగా పరిగణించి ప్రయాణ చార్జీలో ఎలాంటి రీపండ్ ఇవ్వడం లేదు. వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు నిరూపిస్తేనే కొన్ని సందర్భాల్లో మాత్రమే విమాన సంస్థలు తమ విచక్షణ మేరకు రీఫండ్ చేస్తున్నారు. ఈ ఇబ్బందులను తొలగించేందుకు పౌర విమానయాన శాఖ కార్యదర్సి దేశీయ విమానయాన  సంస్థలతో చర్చిస్తున్నారు. ఈ బీమా ప్రీమియం భారాన్ని ప్రయాణికులపై మోపకుండా, విమానయాన సంస్థలో భరించేలా ఒప్పందాలు చేసుకోనున్నారు. ఇదే విషయంపై ఓ బీమా కంపెనీతో కూడా చర్చలు జరుపుతోంది. 
 
మరోవైపు, టిక్కెట్ల రీఫండ్ విషయంలో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా రంగంలోకి దిగింది. రీఫండ్ నిబంధనలను ప్రయాణికులకు మరింత అనుకూలంగా మార్చేందుకు ప్రస్తుత నిబంధనలను సవరించే ప్రక్రియను ప్రారంభించింది.