సోమవారం, 24 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 నవంబరు 2025 (22:31 IST)

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

rajnath singh
పాకిస్థాన్‌ దేశంలో అంతర్భంగా ఉన్న సింధ్ ప్రాంతం భవిష్యత్‌లో భారత్‌లో కలవొచ్చని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ ప్రాంతం నేడు భారత్‌లో భాగం కాకపోయినా ఇక్కడి నాగరికత వారసత్వంతో ఇప్పటికీ ముడిపడివుందన్నారు. అందువల్ల భవిష్యత్‌లో సరిహద్దులు మారొచ్చని, 1947లో దేశ విభజన అనంతరం పాకిస్థాన్‌లో భాగమైన సింధ్ ప్రాంతం భవిష్యత్‌లో తిరిగి భారత్‌లో విలీనం కావొచ్చని ఆయన అన్నారు. 
 
ఢిల్లీలో సింధీ సమాజం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింధీ హిందువులు.. ముఖ్యంగా తన తరం వారు సింధ్‌ను భారత్ నుంచి వేరుచేయడాన్ని ఇప్పటికీ అంగీకరించలేదని బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ ఓ పుస్తకంలో రాశారు. కేవలం సింధ్‌లోనే కాదు.. భారత్‌ వ్యాప్తంగా హిందువులు సింధ్ నదిని పవిత్రంగా భావించేవారు. 
 
నేడు ఆ ప్రాంతం భారత్‌ భాగం కాకపోవచ్చని. కానీ, నాగరికత ప్రకారం ఎల్లపుడూ మన దేశంలో భాగంగా ఉంటుంది. ఇక భూమి విషయానికొస్తే సరిహద్దులు మారొచ్చు. ఎవరికి తెలుసు.. భవిష్యత్‌లో సింధ్ మళ్లీ మన దేశంలో కలవొచ్చు. సింధ్ ప్రజలు ఎక్కడున్నా.. ఎల్లపుడూ మనవాళ్లే అని రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు.