టీ-10 లీగ్.. పాకిస్థాన్‌ను బౌలర్‌తో కరచాలనం చేసిన హర్భజన్ సింగ్
అబుదాబి వేదికగా జరుగుతున్న టీ10 లీగ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, పాకిస్థాన్ బౌలర్ షాహనవాజ్ దహానీతో కరచాలనం చేయడం క్రీడా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఆస్పిన్ స్టాలియన్స్, నార్తర్న్ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం స్టాలియన్స్ కెప్టెన్ అయిన హర్భజన్, దహానీతో స్నేహపూర్వకంగా మాట్లాడి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. గత ఆసియా కప్ సందర్భంగా భారత ఆటగాళ్లు పాకిస్తాన్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకపోవడం వివాదానికి దారి తీసింది.
ఈ ఏడాది పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో క్రీడా సంబంధాల ద్వారా భారత్ పాకిస్థాన్‌కు వ్యతిరేకత తెలుపుతోంది. ఇలాంటి తరుణంలో భజ్జీ పాకిస్థాన్ క్రికెటర్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. హర్భజన్ సింగ్ కొన్ని నెలల క్రితం పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడటానికి నిరాకరించారు.
బుధవారం జరిగిన ఈ టీ10 లీగ్ మ్యాచ్ విషయానికొస్తే, ఆస్పిన్ స్టాలియన్స్‌పై నార్తర్న్ వారియర్స్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో దహానీ కేవలం 10 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కెప్టెన్ హర్భజన్ ఒక ఓవర్ బౌలింగ్ చేసి 8 పరుగులు ఇవ్వగా, బ్యాటింగ్‌లో ఒక పరుగు చేసి రనౌట్ అయ్యాడు.