ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది. చిత్రసీమను తన గుప్పెట్లోకి తీసుకుని, థియేటర్లలో వసూలు చేసే టిక్కెట్ల ధరలను తాజాగా ప్రకటించింది. మొత్తం నాలుగు కేటగిరీలుగా విభజించి ధరలను నిర్ణయించింది. ఈ ధరలో అత్యల్పంగా రూ.5 ఉండగా, గరిష్టంగా రూ.250గా నిర్ణయించారు. ఇకపై ఏపీ రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, ఫ్యాన్స్ షోలకు అనుమతి ఉండగు. అయితే, ఛారిటీ సంస్థల నిధుల సేకరణ కోసం ప్రదర్శించే షోలకు మాత్రం అనుమతి ఉంది.
ఏపీ సర్కారు ప్రకటించిన ఈ టక్కెట్ల వివారలను పరిశీలిస్తే,
మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో...
మల్టీప్రెక్స్‌లలో ప్రీమియం ధర రూ.250, డీలక్స్ రూ.150, ఎకానమీ రూ.75
ఏసీ/ఎయిర్ కూల్ ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40
నాన్ ఏసీ - ప్రీమియం ధర రూ.60, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20గా నిర్ణయించింది.
అలాగే, మున్సిపాలిటీ ప్రాంతాల్లో...
మల్టీప్లెక్స్ .. ప్రీమియం రూ.150, డీలక్స్ రూ.100, ఎకానమీ రూ.60
ఏసీ/ఎయిర్ కూల్ .. ప్రీమియం రూ.70, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30
నాన్ ఏసీ.. ప్రీమియం రూ.50, డీలక్స్ రూ.30, ఎకానమీ రూ.15
నగర పంచాయతీ పరిధిలో...
మల్టీప్లెక్స్.. ప్రీమియం రూ.120, డీలక్స్ 80, ఎకానమీ రూ.40
ఏసీ/ఎయిర్ కూల్ .. ప్రీమియం రూ.35, డీలక్స్ రూ.25, ఎకానమీ రూ.15
నాన్ ఏసీ.. ప్రీమియం రూ.25, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10
గ్రామ పంచాయతీ పరిధిలో..
మల్టీప్లెక్స్.. ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30
ఏసీ/ఎయిర్ కూల్ .. ప్రీమియం రూ.20, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10
నాన్ ఏసీ.. ప్రీమియం రూ.15, డీలక్స్ రూ.10, ఎకానమీ రూ.5