శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 నవంబరు 2021 (15:41 IST)

కేంద్రం ఇచ్చిన నిధులను దోపిడీదారుల్లో దోచుకుంటున్నారు : నారా లోకేశ్

కేంద్రం ఇచ్చిన నిధులను దోపిడీదారుల్లో దోచుకుంటున్నారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఇదే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన మంగళవారం ఒక బహిరంగ లేఖ రాసారు.
 
గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుందన్నారు. ముఖ్యంగా, పంచాయతీల నుంచి రూ.1309 కోట్లను దారి మళ్లించిందని, ఈ మొత్తాన్ని తక్షణం పంచాయతీ ఖాతాలలో జమ చేయాలని కోరారు. 
 
గ్రామాల్లో మురుగునీటి వ్యవస్థ, శానిటైజేషన్, విద్యుత్ దీపాలు, సిమెంట్ రోడ్ల నిర్మాణం తదితర నిర్మాణ పనులకు కేంద్రం ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా కేటాయించిన నిధులను దోపిడీదారుల్లో తరలించుకుపోవడం దారుణని అన్నారు. 
 
మీరు రాష్ట్రానికి ఎలా ముఖ్యమంత్రో... గ్రామానికి గ్రామ సర్పంచ్ కూడా అంతేనన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. సర్పంచులను ఆట బొమ్మలను చేసి పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసే రాజ్యాంగేతర చర్యలను మానుకోవాలని నారా లోకేశ్ రాసిన బహిరంగ లేఖలో  కోరారు.