1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , మంగళవారం, 30 నవంబరు 2021 (14:46 IST)

మీది పాత బండా... అయితే, ఏటా గ్రీన్ టాక్స్!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం వాహ‌నాల‌పై టాక్స్ ల‌ను ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెంచేసింది. పైగా మీరు పాత వాహ‌నాన్ని క‌లిగి ఉన్నారంటే, మీపై గ్రీన్ టాక్స్ భారం ప‌డ‌నుంది. ఏపీ ప్ర‌భుత్వం ఈ కొత్త నిబంధ‌న‌ల‌ను అమ‌ల్లోకి తెస్తోంది. 

 
రవాణా వాహనాలు ఏడేళ్ళు దాటితే యేటా 4 వేలు గ్రీన్ ట్యాక్స్ విధిస్తారు. పదేళ్ళు దాటితే యేటా 5 వేలు, పన్నెండేళ్ళు దాటితే యేటా 6 వేలు చొప్పున గ్రీన్ టాక్స్ వసూలు చేయనున్నారు. మోటర్ సైకిలు పది హేనేళ్ళు దాటితే రెండు వేలు, ఇరవై యేళ్ళు దాటితే అయిదు వేలు గ్రీన్ ట్యాక్స్ విధిస్తారు. కార్లు జీపులు వగైరా పదిహేనేళ్ళు దాటితే ఐదు వేలు, ఇరవై యేళ్ళు దాటితే పదివేలు వసూలు చేయనున్నారు. 

 
ఇక కొత్త వాహనాల కొనుగోనులుపైనా ట్యాక్స్ లు పెంచేశారు. యాభై వేల రూపాయిల పైబడిన బైకులపై 9 నుండి 13 శాతం, 20 లక్షలకు మించి వాహనాలపై 12 నుండి 18 శాతం పన్ను పెంచి వసూలు చేయనున్నారు. దీనితో ఇక వాహ‌నదారుల న‌డ్డి విరిగిన‌ట్లే అని సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఒక ప‌క్క పెట్రోల్ ధ‌ర పెంపు, మ‌రోప‌క్క వాహ‌న ట్యాక్స్ ల పెంపుతో హ‌డ‌లిపోతున్నారు.