1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Kamalananda Bharati Responds about AP Three Capitals

మూడు రాజధానులు క్రమంగా మూడు రాష్ట్రాలకు దారితీయొచ్చు!

Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మూడు రాజధానులు భవిష్యత్తులో క్రమంగా మూడు రాష్ట్రాలకు దారతీయొచ్చునని భువనేశ్వర పీఠాధిపతి (గన్నవరం) కమలానంద భారతి అభిప్రాయపడ్డారు. అందువల్ల మూడు రాజధానుల అంశాన్ని మొగ్గలోనే తుంచేయాలని ఆయన అన్నారు.
 
కాగా, ఇటీవల మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పైగా, త్వరలోనే మూడు రాజధానుల కోసం సమగ్రమైన మెరుగైన బిల్లును ప్రవేశపెడతామంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. 
 
దీనిపై గుంటూరులోని తెనాలిలో జరిగిన ఓ కార్యక్రమంలో కమలానంద భారతి మాట్లాడుతూ, మూడు రాజధానుల బిల్లును మళ్లీ ప్రవేశపెడుతామని ప్రభుత్వం చెబుతుంది. కానీ ఇది కాలక్రమంలో మూడు రాష్ట్రాలకు దారితీసే ప్రమాదముందని హెచ్చరించారు. మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు ఉన్నపుడు మూడు ప్రాంతాలను మూడు ముక్కలు చేయాలన్న భావన ప్రజల్లో కలుగుతుందన్నారు. 
 
ఒక రాష్ట్రం ఒక రాజధాని అనే ప్రాథమిక సూత్రం మేరకు ఒకే ప్రాంతంలోనే రాజధానివుంచి.. అభివృద్ధిని మాత్రం వికేంద్రీకరించాలని కోరారు. పైగా, ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేసి, రాజధాని నిర్మాణానికి ప్రధాని మోడీతో శంకుస్థాపన చేయించారని ఆయన గుర్తుచేశారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
పోక్సో కోర్టు అదుర్స్.. యావజ్జీవ కారాగార శిక్ష...