సంబంధిత వార్తలు
- కోవిడ్-19: ఆందోళన రేకెత్తిస్తున్న అత్యంత ప్రమాదకరమైన కొత్త కరోనా వేరియంట్ B.1.1.529
- కాలేజీలో 182 మందికి కరోనా: ఫ్రెషర్స్ పార్టీనే కొంపముంచింది..
- ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు కరోనా నెగటివ్
- క్వారంటైన్లో మహిళా వైద్యులు... అత్యాచారానికి పాల్పడిన తోటి వైద్యులు.. వీడియో తీసి..?
- కరోనా దేశం నుంచి పోతుందా? 9 నెలల్లో అత్యంత తక్కువ కేసులు నమోదు
సౌతాఫ్రికా నుంచి థానేకు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్
ప్రపంచాన్ని ఒమిక్రాన్ వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే అనేక దేశాల్లో ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా భారత్‌లో కూడా ఒక ఒమిక్రాన్ కేసు నమోదైంది. దక్షిణాఫ్రికా నుంచి మహారాష్ట్రలోని థానేకు వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో అతన్ని ఐసోలేషన్‌కు తరలించారు.
థానే జిల్లాలని దొంబివ్లీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 24వ తేదీ నుంచి సౌతాఫ్రికా నుంచి ఢిల్లీకి వచ్చాడు. అక్కడ నుంచి ముంబైకు చేరుకున్నాడు. అయితే, ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయని నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. వీటిని పరిశీలించగా, అతనికి ఒమిక్రాన్ అని నిర్ధారణ అయింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఈ పరీక్షలు చేశారు. అయితే, ఫలితాలు రావాల్సివుంది.
మరోవైపు, ఆదివారం సౌతాఫ్రికా నుంచి బెంగుళూరుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కూడా పాజిటివ్ వచ్చిన విషయం తెల్సిందే. అయితే, వారికి సోకింది ఒమిక్రాన్ కాదని, డెల్టా స్ట్రెయిన్ అని పరీక్షల్లో తేలింది.
