శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 16 నవంబరు 2021 (10:00 IST)

కరోనా దేశం నుంచి పోతుందా? 9 నెలల్లో అత్యంత తక్కువ కేసులు నమోదు

కరోనావైరస్ కేసులు క్రమేణా తగ్గుతున్నాయి. కరోనా తాజా బులిటెన్ ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 8,865 తాజా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది గత తొమ్మిది నెలల్లో అత్యంత తక్కువగా నమోదైన కేసుల సంఖ్య. కరోనా కారణంగా 197 మరణాలు కూడా నమోదయ్యాయి.
 
 
కరోనా కేసుల తగ్గుదల నేపధ్యంలో సింగపూర్, ఇండోనేషియా, భారతదేశంతో సహా మరో ఐదు దేశాల నుండి టీకాలు వేసిన వారిని నవంబర్ 29 నుండి హోం క్వారెంటైన్ లేకుండా దేశంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుందని దాని రవాణా మంత్రి సోమవారం తెలిపారు. 

 
వచ్చే నెల ప్రారంభం నుండి ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుండి వచ్చే వారికి ఇకపై కరోనా ఆంక్షలు వుండబోవు.