శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 నవంబరు 2021 (19:16 IST)

ఈక్వెడార్ జైల్లో ఘర్షణలు - 68 మంది ఖైదీల మృతి

ఈక్వెడార్ దేశంలోని జైలులో ఖైదీల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో 68 మంది మృత్యువాతపడ్డారు. మరో 25 మంది ఖైదీలకు తీవ్రంగా గాయాలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన గ్వాయాక్విల్‌ నగరంలోని టిటోరల్‌ జైలులో జరిగింది. సెప్టెంబర్‌లో ఇదే జైలులో ఖైదీల మధ్య జరిగిన హింసాత్మక ఘటనలో 119 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. 
 
డ్రగ్స్‌ అక్రమ రవాణా ముఠాల మధ్య వివాదాలే హింసకు కారణంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘర్షణలను అదుపులోకి తెచ్చేందుకు సుమారు వెయ్యి మంది పోలీసులను రంగంలోకి దించారు. 
 
ఖైదీల నుండి పేలుడు పదార్థాలు, తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. జైలు నుండి భారీ పేలుడు రావడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తమ వారు బతికే ఉన్నారో లేదో తెలుసుకునేందుకు భారీగా ఖైదీల బంధువులు అక్కడకు చేరుకున్నారు. జైలు వద్ద భయానక పరిస్థితులు నెలకొనివున్నాయి. జైలులో శవాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. 
 
ఘటనా స్థలంలో పేలుడు పదార్థాలు, తుపాకులు గుర్తించి వాటిని సీజ్ చేసినట్లు లిటోలర్ జైలు అధికారి పేర్కొన్నారు. జైలు లోపల నుంచి చాలా సమయం పాటు పేలుళ్లు వినిపించాయని గాయాక్విల్​ నగరంలో లిటోలర్ జైలు సమీప ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు కొందరు తెలిపారు.