మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 నవంబరు 2021 (16:35 IST)

అమవాస్య రోజున ఆడపిల్ల పుట్టిందని డ్రైనేజీలో పడేశారు...

గుంటూరు జిల్లా చీరలలో దారుణం జరిగింది. దీపావళి పండుగ అమవాస్య రోజున ఆడపిల్ల పుట్టిందనీ ఓ కుటుంబం ఆ బిడ్డను డ్రైనేజీలో పడేశారు. ఈ దారుణం గుంటూరు జిల్లా చీరాలలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చీరాల పట్టణంలోని శ్రీరాం నగర్ ప్రాంతంలోని ఓ డ్రైనేజీలో గురువారం ఆడశిశువును స్థానికులు గుర్తించారు. ఉదయం నుంచి జోరువాన కురుస్తుండటంతో ఎవరూ ఆ శిశువును గమనించలేదు. 
 
10 గంటల తర్వాత వాన తెరపివ్వడంతో అటువైపు వెళ్తున్న అజయ్‌ కుమార్ అనే యువకుడికి డ్రైనేజీలో దుస్తుల్లో చుట్టి ఉన్న పాప కనిపించింది. వెంటనే ఆ శిశువును బయటకు తీసి వైద్య సేవలు అందించేందుకు ప్రయత్నించారు. అయితే కాపాడిన కొద్ది క్షణాలకే ఆ శిశువు కన్నుమూసింది.
 
మస,ాచాచీరాల పట్టణంలోని శ్రీరాం నగర్ ప్రాంతంలోని ఓ డ్రైనేజీలో గురువారం ఆడశిశువును స్థానికులు గుర్తించారు. ఉదయం నుంచి జోరువాన కురుస్తుండటంతో ఎవరూ ఆ శిశువును గమనించలేదు. 
 
10 గంటల తర్వాత వాన తెరపివ్వడంతో అటువైపు వెళ్తున్న అజయ్‌ కుమార్ అనే యువకుడికి డ్రైనేజీలో దుస్తుల్లో చుట్టి ఉన్న పాప కనిపించింది. వెంటనే ఆ శిశువును బయటకు తీసి వైద్య సేవలు అందించేందుకు ప్రయత్నించారు. అయితే కాపాడిన కొద్ది క్షణాలకే ఆ శిశువు కన్నుమూసింది.
 
సమాచారం అందుకున్న పోలీసులు... పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, వైద్య సిబ్బంది కూడా ఆ ఏరియాలో గర్భిణుల వివరాలపై ఆరా తీస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామని డీఎస్పీ శ్రీకాంత్ వెల్లడించారు.