ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 నవంబరు 2021 (16:01 IST)

టెక్నో స్పార్క్​ 8​ కొత్త వేరియంట్‌ రిలీజ్​.. ధర రూ.10వేలు.. ఫీచర్స్ ఇవే

Tecno Spark 8
ప్రముఖ మొబైల్​ తయారీ సంస్థ టెక్నో నుంచి భారత మార్కెట్​లోకి మరో ఎంట్రీ లెవల్​ స్మార్ట్​ఫోన్​ విడుదలైంది. టెక్నో స్పార్క్​ 8​ కొత్త వేరియంట్‌ను రిలీజ్​ చేసింది. ఈ కొత్త వేరియంట్ 3జీబీ ర్యామ్​తో వస్తుంది. వాస్తవానికి, టెక్నో స్పార్క్​ 8 సెప్టెంబర్‌లోనే భారత మార్కెట్​లోకి విడుదలైంది. 
 
అయితే, పాత వెర్షన్​లో అనేక మార్పులు చేసి లేటెస్ట్​ స్మార్ట్​ఫోన్​ను ఇప్పుడు విడుదల చేసింది. సెప్టెంబర్​ వెర్షన్​లో కేవలం 2 జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్‌ను అందించగా.. లేటెస్ట్ వెర్షన్​లో 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్​ను అందించింది.
 
తాజా వేరియంట్​లో సన్నని బెజెల్‌ డిస్​ప్లేని చేర్చింది. పాత వేరియంట్​లో మీడియా టెక్​ హీలియో జీ25 ప్రాసెసర్​ను అందించగా.. తాజా వేరియంట్​లో హీలియో ఏ25 ప్రాసెసర్​ను చేర్చింది. ఈ ప్రాసెసర్ ఎనిమిది కోర్​లను కలిగి ఉంటుంది. ఈ తాజా వెర్షన్ మీకు ప్రీమియం అనుభూతి ఇస్తుంది. కొత్త "మెటల్ కోడింగ్" డిజైన్‌ను కూడా కలిగి ఉంటుంది.