శామ్ సంగ్ నుంచి Samsung Galaxy M32 5G విడుదల
శామ్ సంగ్ నుంచి కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. రూ.20,000 బడ్జెట్‌లో Samsung Galaxy M32 5G స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఈ బడ్జెట్ సెగ్మెంట్‌లో ఇప్పటికే Realme Narzo 30 Pro, Samsung Galaxy A22 5G, Realme X7, Oppo A74, iQoo Z3, Realme 8 5G స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎం32 స్మార్ట్‌ఫోన్ ఉన్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఇదే వర్షన్‌లో 5జీ మొబైల్‌ను పరిచయం చేసింది. సాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.20,999. ఇది 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. దీంతో పాటు 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా రిలీజ్ అయింది. కానీ ధర ఇంకా వెల్లడించలేదు కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ సెప్టెంబర్ 2న మొదలవుతుంది. సాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
సాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6 జీబీ+128 జీబీ, 8 జీబీ + 128 జీబీ వేరియంట్లలో రిలీజ్ అయింది. మైక్రో ఎస్‌డీ కార్డుతో 1టీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ పెంచుకోవచ్చు. 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది.