ఆప్ఘన్ నుంచి వాందరికీ ఈ-వీసా తప్పనిసరి : కేంద్రం
తాలిబన్ హస్తగతమైన ఆప్ఘనిస్థాన్ దేశం నుంచి అనేక మంది మంది ఇతర దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. ఇలాంటివారిలో భారత్‌కు వచ్చే వారందరికీ ఈ-వీసా( e-Visa)లు తప్పనిసరి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, గతంలో ఇండియన్ వీసాలు పొంది ఇప్పుడు మన దేశంలోని లేని ఆఫ్ఘన్ల వీసాలన్నింటినీ రద్దు చేసింది. ఆఫ్ఘన్ జాతీయుల పాస్‌పోర్ట్‌లు గల్లంతయ్యాయన్న వార్తల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
భారత్‌కు రావాలనుకుంటున్న ఆఫ్ఘన్లు వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక పోర్టల్‌ను కూడా సూచించింది. ww.indianvisaonline.gov.inలో ఆఫ్ఘన్ జాతీయులు తమ ఈ-వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.
ఇండియాకు రావాలని అనుకుంటున్న ఆఫ్ఘన్ జాతీయుల దరఖాస్తులను వేగవంతం చేయాలన్న ఉద్దేశంతో ఈ నెల మొదట్లో భారత ప్రభుత్వం కొత్తగా ఈ-వీసాలను జారీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న వీసా కేటగిరీలలో దేని కిందికీ రాని వీసాల కోసం కొత్తగా ఈ e-Emergency X-Misc Visa జారీ చేయనున్నట్లు హోంశాఖ చెప్పింది. ఈ వీసాలను నిర్ధిష్ట కాల పరిమితితో జారీచేస్తారు.