శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 నవంబరు 2021 (18:03 IST)

నవంబర్ 19.. చంద్రగ్రహణం.. వృషభం.. సింహరాశి జాతకులకు?

ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం నవంబర్ 19 సోమవారం ఏర్పడుతుంది. ఈ రోజు కార్తీక పూర్ణిమ. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ చంద్రగ్రహణం అశుభకరంగా భావిస్తున్నారు.
 
అన్ని రాశులపై దీని ప్రభావం కనిపిస్తుంది. ఈ గ్రహణ ప్రభావం దాదాపు ఒక నెల పాటు ఉంటుంది. దీని కారణంగా అన్ని రాశులవారు ఒక నెల పాటు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ముఖ్యంగా రెండు రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
 
నవంబర్ 19, 2021న వృషభరాశి వారికి చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది. కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు ఈ రాశిచక్రాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. రాహువు ఇప్పటికే వృషభరాశిలో ఉన్నాడు కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు గందరగోళ పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. 
 
కొంచెం అజాగ్రత్తగా ఉంటే తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇది మొత్తం కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే దీని వల్ల ఆర్థిక నష్టం కూడా జరుగుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండటం మంచిది.
 
ఈ చంద్ర గ్రహణం కృత్తిక నక్షత్రంలో ఏర్పడుతుంది. ఈ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి చంద్రగ్రహణం ప్రభావం సూర్యునితో సంబంధం ఉన్న అన్ని రాశులపై కనిపిస్తుంది. సింహరాశి కూడా సూర్యుని సంకేతం. అందుకే ఈ రాశి వారి కెరీర్‌పై చెడు ప్రభావం కనిపిస్తుంది. కార్యాలయంలో బాస్‌తో వాగ్వాదం ఉండవచ్చు. 
 
అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండండి. చర్చను పూర్తిగా నివారించండి లేకపోతే ఉద్యోగం పోయే పరిస్థితులు ఏర్పడవచ్చు. మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.