సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 మే 2021 (11:18 IST)

26న ఆకాశంలో అద్భుతం : సంపూర్ణ చంద్రగ్రహణం

ఈ నెల 26వ తేదీన ఆకాశంలో అద్భుతం చోటుచేసుకోనుంది. ఆ రోజున సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఆరోజు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే రేఖలోకి వస్తారు. సూర్యుడు, చంద్రుని మధ్యలోకి భూమి వస్తుంది. 
 
ఈ క్రమంలో సూర్యకిరణాలు చంద్రునిపై పడవు. భూమి నీడ చంద్రునిపై పడుతుంది. ఈ సమయంలో కాంతి తరంగాలు ఫిల్టర్‌ అవుతాయి. దీంతో చంద్రుడు ఎరుపు, నారింజ, గోధుమ రంగుల్లో కనిపిస్తాడు. దేశానికి ఈశాన్యాన ఆకాశంలో ఈనెల 26వ తేదీన సాయంత్రం ఈ అరుదైన సూపర్‌ బ్లడ్‌ మూన్‌ ఆవిష్కృతం కానుంది. 
 
సంపూర్ణ చంద్ర గ్రహణం అనంతరం ఇది సంభవిస్తుంది. ఈ గ్రహణం సాయంత్రం 3.15 గంటలకు ప్రారంభమై 6.22 గంటలకు ముగుస్తుంది. అంటే 14 నిమిషాల 30 సెకన్ల పాటు ఉంటుంది. 
 
ఇలాంటి చంద్ర గ్రహణాన్ని పదేళ్ల క్రితం అంటే 2011 డిసెంబరు 10న చూడగలిగిందని ఎంపీ బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్‌, ప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త దేబీ ప్రసాద్‌ దౌరీ తెలిపారు.