ఆదివారం, 16 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శనివారం, 15 నవంబరు 2025 (18:02 IST)

సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం

Sangeeth Shobhan movie pooja, Rahul Ravindran and others
Sangeeth Shobhan movie pooja, Rahul Ravindran and others
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ మూవీస్ తో స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో సంగీత్ శోభన్, ఇటీవల గర్ల్ ఫ్రెండ్ తో సూపర్ హిట్ అందుకున్న నిర్మాత ధీరజ్ మొగిలినేని, న్యూ యాస్పరెంట్ ప్రొడ్యూసర్ గిరిబాబు వల్లభనేని, టాలెంటెడ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ కాంబోలో ఓ క్రేజీ మూవీ రాబోతోంది.

ఈ రోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవంలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్క్రిప్ట్ అందజేయగా , నిర్మాత ఎస్ కేఎన్ ఫస్ట్ క్లాప్ ఇచ్చి మూవీ టీమ్ కు తమ బెస్ట్ విశెస్ అందించారు.
 
ఓ సరికొత్త ట్రెండీ లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కనుంది. ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.3 గా ఈ సినిమా నిర్మాణం కానుంది. ఈ చిత్రాన్ని లక్ష్మీ భూపాల్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రేజీ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.