శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 నవంబరు 2021 (22:44 IST)

క్వారంటైన్‌లో మహిళా వైద్యులు... అత్యాచారానికి పాల్పడిన తోటి వైద్యులు.. వీడియో తీసి..?

కరోనా సోకిందని క్వారంటైన్‌లో వున్న మహిళలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. వార్డులోని పేషెంట్లపై కూడా అకృత్యాలు జరిగిన దాఖలాలున్నాయి. తాజాగా క్వారంటైన్‌లో ఉన్న తోటి మహిళా వైద్యులపై మరో ఇద్దరు డాక్టర్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. 
 
అంతటితో ఆగకుండా అత్యాచార ఘటనను వీడియో తీసి.. బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టారు కామాంధులు.  అయితే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చివరకు కటకటాలపాలయ్యారు.
 
వివరాల్లోకి వెళితే, చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా డాక్టర్లు చెన్నై టీ నగర్ లోని ఓ స్టార్ హోటల్ లో క్వారంటైన్‌లో ఉన్నారు. అదే హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్న వెట్రిసెల్వన్ (35), మోహన్ రాజ్ (25) అనే మరో ఇద్దరు డాక్టర్లు మహిళా వైద్యుల గదికి వెళ్లి... వారిపై అత్యాచారానిి పాల్పడ్డారు. 
 
దానిని వీడియో తీసి మరీ బ్లాక్ మెయిల్ చేశారు. ఇలా పలుమార్లు మహిళ వైద్యులపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. అయితే ఎంతకీ వారి అకృత్యాలు ఆగకపోతుండడంతో.. ఆరోగ్య శాఖ మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.
 
వారి ఆదేశాల మేరకు చెన్నై పోలీస్ కమిషనర్ విచారణ ప్రారంభించారు. తేనాంపేట మహిళా పోలీసుల విచారణలో నేరం నిర్ధారణ అయింది. దీంతో ఇద్దరు నిందితులను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారిద్దరినీ ఆరోగ్య శాఖ డిస్మిస్ చేసింది.