గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 నవంబరు 2021 (09:12 IST)

చెన్నైకు భారీ వర్షం సూచన : నేడు రెడ్ ‌అలెర్ట్

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైతో పాటు.. దాని పొరుగు జిల్లాలోనై చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచనను చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం చేసింది. దీంతో రెడ్ అలెర్ట్‌ను ప్రకటించారు. నాలుగు జిల్లాలకు స్కూల్స్ సెలవులు ప్రకటించారు.
 
నిజానికి గత కొన్ని రోజులుగా చెన్నైతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతు రాజధాని వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం చెన్నై సమీపంలో తీరందాటే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీంతో చెన్నై, సమీప జిల్లాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. గురువారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. 
 
వాతావరణ శాఖ అధికారులు చెన్నైకి రెడ్‌ అలర్ట్‌ జారీచేశారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు, కడలూరులో అతిభారీ వర్షాలు కురుస్తాయని, విళ్లుపురం జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
 
చెన్నైలో 20 సెంటీమీట్ల కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. దీంతో అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. చెన్నై కార్పొరేషన్‌లో వార్‌ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామని, అవసరమైన సహాయం అందజేస్తామని వెల్లడించింది.