మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 నవంబరు 2021 (14:11 IST)

వారితో చనువుగా ఉంటుందనీ భార్యను కడతేర్చిన భర్త

పనిచేసే ప్రదేశంలో మరో ఇద్దరితో భార్య చనువుగా ఉండటాన్ని జీర్ణించుకోలేక పోయిన భర్త... ఆమెను కడతేర్చాడు. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగర శివారు ప్రాంతమైన మీంజూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మీంజూరుకు చెందిన మీనాకు చెన్నైకి చెందిన ముత‌రాస‌న్‌ను కొన్నేండ్ల కింద‌ట వివాహమైంది. మీనా ప్ర‌వ‌ర్త‌న‌పై ముత‌రాస‌న్ అనుమానం పెంచుకోవ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వలు జ‌రుగుతుండేవ‌ని స్ధానికులు చెబుతున్నారు. 
 
అదేసమయంలో ప‌నిచేసే ప్ర‌దేశంలో మీనా ఇత‌ర వ్య‌క్తుల‌తో చ‌నువుగా ఉండ‌టం ముత‌రాస‌న్‌కు ఏమాత్రం నచ్చలేదు. పైగా, అతనిలో అనుమానం బ‌ల‌పడేలా చేసింది. అంతే ఆమెను కడతేర్చాడు. 
 
వివాహిత మృత‌దేహం మింజూర్ వ‌ద్ద ఓ గుడి స‌మీపంలో శ‌నివారం రాత్రి ల‌భ్య‌మైంది. స్థానికులు స‌మాచారం ఇవ్వ‌డంతో పోలీసులు ఘ‌ట‌నా స్ధలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మ‌హిళ గొంతుపై పెనుగులాడిన గుర్తులు ఉండ‌టంతో భ‌ర్తే ఘాతుకానికి తెగ‌బ‌డ్డాడ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
మ‌హిళపై ఆభ‌ర‌ణాలు అలాగే ఉండ‌టం, హ‌త్య త‌ర్వాత భ‌ర్త క‌నిపించ‌కుండా పోవ‌డంతో పోలీసులు ఆయ‌న‌ను అనుమానిస్తున్నారు. అలాగే, మృతురాలు హత్యకు గురైన స్థలంలోనే ఆమె చనువుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారనీ వారిని చూడగానే ముతరాసన్‌కు ఆగ్రహం కట్టలు తెంచుకునిరావడంతో ఈ దారణానికి పాల్పడివుంటాడని సమాచారం.