శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 నవంబరు 2021 (10:47 IST)

సీఎం కాన్వాయ్ వెంట పరుగులు తీసిన మహిళ.. ఎందుకంటే?

తిరుపతిలో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో పాల్గొనడానికి ఏపీ సీఎం జగన్‌ తిరుపతికి రానున్నారు. ఈ నేపథ్యంలో రేణిగుంట ఎయిర్‌పోర్టు సమీపంలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. 
 
ఈ నేపథ్యంలో రేణిగుంట ఎయిర్‌పోర్టు చేరుకున్న జగన్‌.. తన కాన్వాయ్‌లో తిరుపతికి బయలుదేరారు. అయితే అలా మొదలై సీఎం కాన్వాయ్‌ వెంబడి ఓ మహిళ పరిగెత్తుతూ వచ్చింది.
 
ఇది గమనించిన సీఎం జగన్‌ కాన్వాయ్‌కి నిలిపివేయించి.. ఓఎస్డీని ఆ మహిళ దగ్గరకు పంపించారు. అంతేకాకుండా ఆ మహిళ వివరాలు తెలుసుకున్నారు. ఆ మహిళ తనకు ఉద్యోగం కావాలని.. ఆ విషయం సీఎం జగన్‌కు తెలిపేందుకు పరిగెత్తానని తెలపడంతో.. ఆమెకు ఉద్యోగ అవకాశం కల్పిస్తానని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు.