1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 నవంబరు 2021 (13:56 IST)

చిక్కడపల్లిలో బ్యూటీపార్లకు‌కు వెళ్లిన మహిళ అదృశ్యం

హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లిలో బ్యూటీపార్లర్‌కు వెళ్లిన ఓ మహిళ ఉన్నట్టుండి అదృశ్యమైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ దోమలగూడ గగన్‌మహల్‌లో నివసించే జి.దుర్గాప్రసాద్, భార్గవి(26) అనే దంపతులు ఉన్నారు. 
 
అయితే, భార్గవి బుధవారం సాయంత్రం 5.30 సమయంలో సమీపంలోని బ్యూటీపార్లర్‌కు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది.  సాయంత్రం 6.30 గంటలైనా ఇంటికి రాలేదు. దీంతో భార్యకు భర్త ఫోన్ చేయగా, ఫోన్ స్విచ్ఛాఫ్‌ వుంది. 
 
దీంతో దుర్గాప్రసాద్‌ బ్యూటీపార్లర్‌కు వెళ్లి వాకబు చేయగా అక్కడకు రాలేదని చెప్పారు. దీంతో బంధువులు, స్నేహితులను సంప్రదించాడు. ఫలితం లేకపోవడంతో దుర్గాప్రసాద్‌ చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ ప్రేమ్‌కుమార్‌ కోరారు.