శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 నవంబరు 2021 (13:43 IST)

విగ్గు మాస్టర్ లీలలు - 20 మంది అమ్మాయిలను బురిడీ కొట్టించిన కేటుగాడు

హైదరాబాద్ నగరంలో విగ్గు మాస్టర్ లీలలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. బట్ట తలకు రకరకాలైన విగ్గులు పెట్టుకుని ఏకంగా 20 మంది అమ్మాయిలను మోసం చేసిన కేటుగాడిని హైదరాబాద్ నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. 
 
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌కు చెందిన షేక్ మహ్మద్ రఫీ అనే వ్యక్తి ఓ ఎన్ఆర్ఐ. ఈయన ఓ మహిళతో కొంతకాలం సహజీవనం చేశాడు. వారిద్దరూ సన్నిహితంగా ఉన్నపుడు ఫోటోలు తీసి, వాటిని చూపించి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేశాడు. 
 
 
ఆ తర్వాత రకరకాలైన విగ్గులతో ఫోటోలు దిగి వాటిని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫోటోలు పోస్ట్ చేసేవాడు. అలా తనతో టచ్‌లోకి వచ్చిన వారిన అమ్మాయిలు, మహిళల్లో 20 మందిని బురిడీ కొట్టించాడు. చివరకు అతని నిజస్వరూపం తెలుసుకుని అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.