సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 10 నవంబరు 2021 (22:06 IST)

పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో యువతిపై దాడి

ఎల్బీనగర్‌ పీఎస్‌ పరిధిలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతిపై బస్వరాజు అనే యువకుడు కత్తితో దాడి చేశాడు.

హస్తినాపురంలోని యువతి ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశాడు. ప్రేమించి పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో బస్వరాజు దాడికి పాల్పడ్డాడు.

శిరీష పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. నిందితుడు బస్వరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు బస్వరాజు, బాధితురాలు వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలానికి చెందినవారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే వేరే వివాహం చేసుకుంటున్నానని బస్వరాజు తనపై దాడి చేసినట్లు బాధితురాలు తెలిపారు.

తనకు వివాహం ఫిక్స్ అయిందని, ఫోన్ చేయకని తాను చెప్పినా వినలేదని ఆమె చెప్పారు. గతంలో తాము ఇద్దరం ప్రేమించుకున్నామని బాధితురాలు పేర్కొన్నారు.