సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 8 నవంబరు 2021 (11:58 IST)

ఇద్దరు ప్రియురాళ్లలో ఒకరికి తాళి, కత్తి తీసుకుని పొడిచేసింది

వాళ్లిద్దరూ ప్రాణ స్నేహితురాళ్లు. ఎక్కడికైనా కలిసే వెళ్లేవారు. ఈ క్రమంలో వారికి ఓ యువకుడు పరిచయమయ్యాడు. కానీ అతడు వీరిద్దరినీ బోల్తా కొట్టించి ఒకరికి తెలియకుండా మరికొర్ని ప్రేమించి బాగా సన్నిహితమయ్యాడు.


కొన్ని నెలలుగా వారితో ఒకరికి తెలియకుండా ఇంకొకరితో ఎఫైర్ సాగించాడు. చివరికి వారిలో ఒకరిని పెళ్లాడేందుకు సిద్ధమయ్యాడు. దీన్ని జీర్ణించుకోలేని రెండో ప్రేమికురాలు తన స్నేహితురాలు, ప్రియుడికి కాబోయే భార్యపై కత్తితో దాడి చేసింది.

 
వివరాలు చూస్తే... కర్నాటక శిడ్లఘట్ట తాలూకలోని ఆనేమడుగు గ్రామానికి చెందిన 20 ఏళ్ల గంగోత్రి, 19 ఏళ్ల మోనికి ప్రాణస్నేహితురాళ్లు. వీరిని 20 ఏళ్ల గంగరాజు ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రేమలో దింపి సన్నిహితమయ్యాడు. చివరికి మోనికను పెళ్లాడేందుకు సిద్ధమయ్యాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు.

 
ఇది తెలుసుకున్న గంగోత్రి తీవ్ర ఆగ్రహానికి లోనైంది. ప్రియుడిని వదిలేసి తన స్నేహితురాలు, గంగరాజుకి కాబోయే భార్య అయిన మోనికపై దాడి చేసింది. కత్తితో విచక్షణారహితంగా దాడి చేయగా, మోనికకు మెడ, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.