బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : ఆదివారం, 7 నవంబరు 2021 (21:36 IST)

15 నుంచి భవానీ మండల దీక్షా ధారణలు ప్రారంభం

ఈ నెల 15వ తేదీ నుంచి భవానీ మండల దీక్షా ధారణలు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 5వ తేదీ నుంచి అర్ధమండల దీక్షలు ప్రారంభంకానున్నాయి. 18న కలశ‌జ్యోతి మహోత్సవం.. అలాగే డిసెంబర్ 25 నుంచి 29 వరకు భవానీ దీక్షా విరమణలు జరుగుతాయి. 29వ తేదీన పూర్ణాహుతితో భవానీ దీక్షాల విరమణలు ముగియనున్నాయి.

భవానీ దీక్షా విరమణ సమయంలో తెల్లవారు జామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తూ.. భవానీ దీక్షా మహోత్సవాల పోస్టర్‌ను ఇంద్రకీలాద్రిపై ఆదివారం జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో దుర్గగుడి చైర్మన్ పైలా‌ సోమినాయుడు, ఈవో బ్రమరాంబ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవానీ దీక్షా విరణమలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. భవానీలకు కొండకింద హోమ గుండాలను ఏర్పాటు చేశామని, వినాయకుని గుడి నుంచి క్యూలైన్ల మీదుగా అమ్మవారి దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. అయితే ఘాట్లలో నదీ స్నానానికి అనుమతి లేదన్నారు. కేవలం జల్లుల స్నానాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.

గిరి ప్రదక్షణకు కలెక్టర్ అనుమతి కోరామని, కలెక్టర్ ఆదేశానుసారం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్క భవానీ భక్తుడు కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని, కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకోని వారు వేసుకోవాలని సూచించారు. ఉచిత దర్శనం, రూ.100 టిక్కెట్ ఆన్‌లైన్ స్లాట్ అందుబాటులో ఉంచామని తెలిపారు.