ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణకు ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. 2017 సంవత్సరంల తాను ఒక మైనర్ వాటాదారుడుగా ఉన్న ప్రాపర్టీని కొనుగోలు చేశానని, దానిపై ఈడీ సమస్య ఉత్పన్నమైందన్నారు.
మైనర్ వాటాదారుడు బ్యాంకు రుణం తీసుకుని చెల్లించలేదని, అకౌంట్స్ పుస్తకంలో నా పేరు ఉండటంతో ఈడీ అధికారులు విచారణకు పిలిచారని తెలిపారు. ఈడీ పిలుపు మేరకు బాధ్యత గల పౌరుడిగా విచారణకు హాజరై విచారణ ఇచ్చినట్టు తెలిపారు. కాగా, అల్లు అరవింద్ వంటి బడా నిర్మాత ఉన్నట్టుడి ఈడీ విచారణకు వెల్లడం ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారింది.