సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 నవంబరు 2021 (12:01 IST)

"భీమ్లా నాయక్" నుంచి 'లాలా భీమ్లా' వచ్చేసింది...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు సమకూర్చుతున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన భీమ్లా నాయక్ పాట సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తుంది. ఇపుడు తాజాగా లాలా.. భీమ్లా అనే పాటను రిలీజ్ చేశారు. ఇది పవన్ ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులకు సైతం పూనకాలు తెప్పించేలావుంది. 
 
మలయాళ సూపర్‌ హిట్‌ సినిమా 'అయ్యప్పనుమ్‌ కోషియమ్' తెలుగులో "భీమ్లా నాయక్"గా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా ప్రధాన పాత్రల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్‌తో పాటు 'అంతా ఇష్టం ఏందయ్య' మెలోడీ సాంగ్ కూడా సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. 
 
ఎప్పుడెప్పుడా అని ఎదురుచుస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాలా భీమ్లా ఫుల్ సాంగ్ తాజాగా విడుదలైంది. లాలా భీమ్లా సాంగ్ను మేకర్స్ నవంబర్ 7న ఉదయం 11.07 నిమిషాలకు విడుదల చేశారు. 
 
ఇటీవల విడుదలైన 'లాలా భీమ్లా' వీడియో ప్రోమోలో పవన్ కళ్యాణ్ నుదుటిన తిలకంతో.. మందు సీసాతో "నాగరాజు గారు హార్టీ కంగ్రాచ్యులేషన్స్‌ అండి.. మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసింది.. హ్యాపీ దీపావళి" అంటూ చెప్పిన డైలాగ్ పవర్ స్టార్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి. 
 
ఇక తాజాగా విడుదలైన కాసేపటికి ఈ పాట మంచి వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రేండింగ్‌లో నిలిచింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ జంటగా నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న భీమ్లా నాయక్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.