బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 6 నవంబరు 2021 (07:43 IST)

ఇది నా పూర్వ జన్మ సుకృతం - సాయితేజ్‌

Saitej family members
సాయితేజ్ రోడ్డు ప్ర‌మాదంలో బైక్ పైనుంచి ప‌డిన సంగ‌తి తెలిసిందే. కొంత‌కాలం ఆసుప‌త్రి పాల‌య్యారు. ఆయ‌న పూర్తిగా కోలుకుని దీపావ‌ళికి వారి కుటుంబంలో వెలుగునింపారు. ఇదే విష‌యాన్ని సాయితేజ్ ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డిస్తూ,  అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి కోలుకున్నా. మా  మామ‌య్య‌లు, కుటుంబ స‌భ్యులు, అభిమానులు దీవెన‌లు నాకు అండ‌గా వున్నాయంటూ సాయితేజ్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇది నాకు పునర్జన్మ. కారణమైన మీ ప్రేమకు, మీ ప్రార్థన లకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని అన్నారు. మీ ప్రేమ పొందడం నా పూర్వ జన్మ సుకృతం అంటూ చెప్పుకొచ్చారు.
 
మాకు నిజ‌మైన పండుగః చిరంజీవి
 
సాయితేజ్ కోలుకున్న సంద‌ర్భంగా మెగా ఫ్యామిలీతోపాటు మెగా ఫ్యామిలీకి చెందిన కార్యాల‌యాల‌లోని సిబ్బందికి మిఠాయిలు పంచారు. దీపావ‌ళి త‌గు జాగ్ర‌త్త‌ల‌తో జ‌రుపుకోవాల‌ని వారికి సూచించారు.  
 
సాయి ధరమ్ తేజ్ కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ఫోటో ఒకటి మెగాస్టార్ చిరంజీవి ట్విట్ట‌ర్ పోస్ట్ చేశాడు. ఇది మా కుటుంబంలో నిజ‌మైన దీపావ‌ళి అంటూ వ్యాఖ్యానించారు. ఈ ఫోటో లో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, అఖిరా, పంజా వైష్ణవ్ తేజ్ ఉన్నారు.