మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 5 నవంబరు 2021 (14:59 IST)

చిరంజీవి ఎలాంటివారో 'ఆహా'లో బాలయ్యతో చెప్పిన మోహన్ బాబు

బాలయ్య ఆహాలో ఏం చేస్తాడోనని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ దీపావళి నాడు బాలయ్య ఆహా అన్‌స్టాపబుల్ విత్ NBK ఎపిసోడ్ విడుదలైంది. ఇందులో బాలయ్య సందడి మామూలుగా లేదు. పైగా తొలి ఎపిసోడ్లోనే కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో చేసారు. ఈ షోకి మంచు విష్ణు, లక్ష్మిలు వచ్చి సందడి చేసారు.

 
ఇకపోతే ఈ షోలో మోహన్ బాబును బాలయ్య చాలా ఆసక్తికర ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అందులో ఒకటి చిరంజీవి గురించి మీ అభిప్రాయం ఏంటి అన్నది. అందుకు మోహన్ బాబు సమాధానమిస్తూ మా సోదరి వంటి సురేఖను పెళ్లి చేసుకున్నారు. మంచి నటుడు, బాగా వుంటారు అని అన్నారు.
 
తన సినిమా కెరీర్ గురించి చెబుతూ... తన బ్యానర్లో చిత్రాలు నిర్మించిన సమయంలో వరుస ఫ్లాపులతో కట్టుకున్న ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చిందన్నారు. తనకు ఎవరూ సాయం చేయలేదనీ, మళ్లీ అసెంబ్లీ రౌడీ, అల్లుడుగారు, పెదరాయుడు చిత్రాలతో నిలదొక్కుకున్నట్లు చెప్పారు. ఆ సమయంలో మోహన్ బాబు ఉద్వేగానికి లోనయ్యారు.