శనివారం, 5 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 నవంబరు 2021 (09:56 IST)

చిరంజీవి దెయ్యంగా మారిపోయారు... ఎందుకో తెలుసా? (video)

చిరు తన అభిమానులకు 'హ్యాపీ హాలోవీన్' అంటూ శుభాకాంక్షలు తెలపడమే కాకుండా చిన్న వీడియోను విడుదల చేశారు. వీడియోలో చిరు హాలోవీన్ మేక్ఓవర్ పొందడానికి యాప్‌ని ఉపయోగిస్తున్నట్లు చూపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేస్తూ, 'ఉత్కంఠభరితమైన రోజు' అని క్యాప్షన్ ఇచ్చాడు మెగాస్టార్. ఈ వీడియో మెగా అభిమానులను అమితంగా ఆకర్షిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి దెయ్యంలా మారి భయపెడుతున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఇక చిరు సినిమాల విషయానికొస్తే. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న చిరు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'ఆచార్య' చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక ప్రస్తుతం ఆయన చేతిలో 'గాడ్‌ఫాదర్', 'భోళా శంకర్' వంటి వరుస సినిమాలు ఉన్నాయి. కాగా హాలోవీన్ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సెలెబ్రేషన్స్ చేసుకున్న సంగతి తెలిసిందే.