శనివారం, 13 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (13:07 IST)

ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కుమార్తె.. ఏడుగురిని సజీవ దహనం చేసిన వ్యక్తి..

తన కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నదంటూ ఓ వ్యక్తి కుటుంబంలోని ఏడుగురిని సజీవ దహనం చేశాడు. అందులో అతని ఇద్దరు కూతుళ్లు, నలుగురు మనవలు, మనవరాళ్లు ఉన్నారు. ఈ ఘటన పాకిస్థాన్‌లో జరిగింది.
 
పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ముజఫర్‌గఢ్‌కు చెందిన మంజూర్ హుస్సేన్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. మంజూర్ కూతురు ఫౌజియా బీబీ, ఆమె నెలల చిన్నారి, భర్త, మరో నలుగురు పిల్లలు ఈ ఘటనలో మృత్యువాత పడ్డారు. 
 
ఇందులో నుంచి బయటపడిన హుస్సేన్‌ మరో అల్లుడు మెహబూబ్ అహ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంజూర్ హుస్సేన్‌తోపాటు అతని కొడుకు సాబిర్ హుస్సేనే ఈ దారుణానికి పాల్పడ్డారని, తాను ఇంటికి వచ్చే సమయానికి ఆ ఇద్దరూ పారిపోవడం చూశానని అతడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.