భర్తపై అనుమానం.. జిమ్‌లో మహిళను చితకబాదిన భార్య
భర్తతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో అతడి భార్య ఓ మహిళపై వ్యాయామశాలలో బూట్లతో దాడికి దిగింది. పక్కనున్నవారు ఆపడానికి ప్రయత్నించినా శాంతించకుండా విచక్షణారహితంగా విరుచుకుపడింది.
ఆమె ఎవరో తనకు తెలియదని భర్త ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు. చివరికి భార్యాభర్తలిద్దరూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పరస్పరం కేసులు పెట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ ఘటన జరిగింది.
ఈ నెల 15న జరిగిన ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. 30 ఏళ్ల ఆ మహిళ బుర్ఖా ధరించి తన సోదరితో కలసి ఓ జిమ్‌కు వచ్చింది. అక్కడ వ్యాయామాలు చేస్తున్న భర్త పక్కన ఉన్న మహిళను చూసింది.
భర్తతో ఆమెకు సంబంధం ఉందని అనుమానించింది. ఈ విషయమై అతడితో గొడవకు దిగి.. ఆ మహిళపై ఒక్కసారిగా దాడికి పాల్పడింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.