మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (23:08 IST)

నయనతారకు ఆల్ ది బిస్ట్.. సమంత పోస్ట్ వైరల్..

స్టార్ హీరోయిన్ సమంత విడాకుల విషయం గురించి ప్రతి రోజు ఏదో ఒక వార్త ద్వారా సోషల్ మీడియాలో అవుతున్నాయి. ఈ క్రమంలోనే అక్టోబర్ 2వ తేదీ విడాకుల విషయాన్ని ప్రకటించిన తర్వాత సమంత గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. 
 
తాజాగా సమంత మరొక పోస్టును అమ్మ చెప్పింది అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా సమంత స్పందిస్తూ ఇప్పుడు ఈ సమయంలో మీరు ఇలా ఉన్నందుకు ఎంతో కృతజ్ఞతగా ఉండండి.. అలాగే రేపు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు దాని కోసం ప్రయత్నం చేయండి అంటూ సమంత తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
ఇకపోతే సమంత ప్రస్తుతం తన స్నేహితురాలతో కలిసి వివిధ తీర్థయాత్రలను చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక విడాకుల తర్వాత సమంతా ఒంటరిగా తన జీవితాన్ని గడపుతూ మరోసారి సినిమాలపై తన దృష్టిని సారించింది. 
 
ఈ క్రమంలోనే దసరా కానుకగా సమంత రెండు సినిమాలను అధికారికంగా ప్రకటించింది. ఇక తెలుగులో సమంత నటించిన పౌరాణిక చిత్రం శాకుంతలం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందని త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.
 
మరోవైపుహీరోల మాదిరిగానే హీరోయిన్స్ మధ్య కూడా సఖ్యత ఉంటుంది. కొందరు హీరోయిన్స్ అయితే చాలా క్లోజ్‌గా ఉంటూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇటీవల సమంత, త్రిష, కళ్యాణి ప్రియదర్శన్‌తో కలిసి చెన్నైలో తెగ రచ్చ చేసింది. ప్రస్తుతం నయనతారతో కలిసి సినిమా చేస్తుంది సమంత. అయితే ఈ ముద్దుగుమ్మ నయనతారతో పాటు ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్‌కి బెస్ట్ విషెస్ అందించింది.
 
తమిళ చిత్రం 'కూళంగల్' (పెబెల్స్‌) 2022లో జరిగే 94వ ఆస్కార్‌ పోటీలకు మనదేశం తరఫు నుంచి ఎంట్రీ ఇవ్వనుంది. ఇదే విషయాన్ని శనివారం ఆస్కార్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్‌ పర్శన్‌ షాజీ ఎన్‌ కరుణ్‌ ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు (ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా) ఎఫ్‌ఎఫ్‌ఐ జనరల్‌ సెక్రెటరీ సుప్రాన్‌ సెన్‌ తెలిపారు.ఈ విషయం ప్రకటించిన వెంటనే వారికి పలువురు సెలబ్స్ శుభాకాంక్షలు తెలియజేశారు.
 
అందాల నాయిక సమంత తన మైక్రో బ్లాగింగ్ పేజ్ ద్వారా ఆ ఇద్దరికీ అభినందనలు తెలిపారు. 'మీ ఇద్దరికీ ఘనమైన అభినందనలు. ఇది చాలా అద్భుతమైన వార్త. 'కూళంగల్' సినిమా టీమ్ కి కూడా నా శుభాభినందనలు. మోర్ పవర్ టు యూ' అంటూ సామ్ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.