మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 30 అక్టోబరు 2021 (17:53 IST)

ప్ర‌కాష్‌రాజ్ సినిమాకు చిరంజీవి వాయిస్ ఇచ్చారు

Prakashraj, Chiranjeevi
న‌టుడు ప్ర‌కాష్‌రాజ్ గురించి తెలిసిందే. `మా` ఎన్నిక‌ల్లో అధ్య‌క్షునిగా పోటీ చేసి ఓడిపోయిన న‌టుడు. ఆయ‌న‌కు మెగాస్గార్ కుటుంబం నాగ‌బాబు స‌పోర్ట్ చేశారు. అయితే, తాజాగా ప్ర‌కాష్‌రాజ్ న‌టించిన సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవ‌ర్ ఇచ్చారు. ఆ సినిమానే రంగమార్తాండ. దీనికి ద‌ర్శ‌కుడు కృష్ణ వంశీ.  ఇందులో శివత్మిక రాజశేఖర్, వంశీ చాగంటి, కన్నెగంటి బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ త‌దిత‌రులు న‌టించారు. ఈ సినిమాకు తాజాగా చిరంజీవి వాయిస్ ఓవ‌ర్ ఇచ్చాడు. ప్ర‌కాష్ రాజ్ పాత్ర రాక‌తోనే ఆ వాయిస్ వినిపిస్తుంద‌ట‌.
 
ఇందుకు కృష్ణ‌వంశీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.  మొద‌ట చిరంజీవి అంగీక‌రిస్తారోలేరోన‌ని అనుకున్నాను. కానీ ఆయ‌న ఆనందంగా చెబుతాన‌ని అన‌డంతో ఆయ‌న ఔన‌త్యానికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. క‌రోనాకు ముందే ఈ చిత్రం ప్లాన్ చేశారు. ఇప్ప‌టికీ  చిత్రం దాదాపు ముగింపు ద‌శ‌కు చేరుకుంది. త్వ‌ర‌లో ఈ సినిమా గురించి మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.